Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2017 11:04:36
facebook Twitter Googleplus
Photo

క్రితం వరుసగా భారీ సినిమాలతో డైరెక్టర్ మెహర్ రమేష్ సెన్సేషన్ సృష్టించేశాడు. చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే కావడంతో అనతి కాలంలోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అవేవీ బాక్సాఫీస్ దగ్గర ఫేర్ చేయకపోవడంతో అంతే స్పీడ్ గా కనుమరుగై పోయాడు.

అలాగని మెహర్ రమేష్ ఇండస్ట్రీ నుంచి దూరమైపోయిందేమీ లేదు. అటు మహేష్ బాబు ఫ్యామిలీకి.. ఇటు మెగా కుటుంబానికి బాగా సన్నిహితుడు ఈ దర్శకుడు. మహేష్ బాబు మూవీ ఆడియో లాంఛ్ అయినా.. వాళ్లింట్లో జరిగే ప్రైవేట్ పార్టీ అయినా.. ఆఖరికి మహేష్ ఏదైనా టూర్ లో ఉన్నా సరే అక్కడ కూడా కనిపిస్తుంటాడు మెహర్ రమేష్. ఇక మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా ఈ డైరెక్టర్ ప్రెజెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. సినిమా ప్రీమియర్స్ కు ఆహ్వానాలు కూడా అందుతుంటాయి. సాయిధరం తేజ్ నటించిన జవాన్ మూవీ ప్రీమియర్ షోకి కూడా మెహర్ రమేష్ కి ఇన్విటేషన్ అందింది.

ఈ తరహా పిలుపులు బాగానే ఉన్నాయ్ కానీ.. మరి వీరిలో ఎవరైనా మెహర్ రమేష్ కి సినిమా ఆఫర్ ఇస్తారా అంటే.. ఆ అవకాశమే కనిపించడం లేదు. ప్రజెంట్ మాత్రమే కాదు.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇతని పేరు వినిపించిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు.

,  ,  ,  ,  ,  ,