Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2017 17:02:40
facebook Twitter Googleplus
Photo

బిగ్గెస్ట్ షో అయిన బిగ్ బాస్ షో ఇప్పుడు తెలియని భాషల వారికి కూడా చాలా దగ్గరవుతోంది. సల్మాన్ ఖాన్ హోస్టింగ్ తో నార్త్ లో బిగ్గెస్ట్ షోగా ఫెమాస్ అయిన ఈ షో చివరికి సౌత్ జనాలను కూడా ఆకట్టుకుంటోంది. తమిళ్ లో పడి లేస్తూ ఎదో అలా సాగింది. కమల్ హాసన్ అక్కడ హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మాత్రం బిగ్ బాస్ ఉహించని స్థాయిలో విజయవంతంగా టెలికాస్ట్ అయ్యింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా సూపర్బ్ అనిపించుకున్నాడు. బిగ్ బాస్ లో మొదట కాంటెస్ట్ లను చూసినపుడు అందరూ కొంత నిరాశ చెందారు కానీ శని ఆదివారాల్లో తారక్ వచ్చి తన మాటలతో హావభావాలతో సరదాగా షోను నడిపించి బూస్ట్ ఇచ్చేవాడు. దీంతో ఫైనల్ వరకు బుల్లి తెర ప్రేక్షకులు చాలా పెరిగిపోయారు. అయితే మరీ నెక్స్ట్ సీజన్ కి కూడా తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. నెక్స్ట్ ఇయర్ మళ్లీ ఇదే స్థాయిలో బిగ్ బాస్ షోని నిర్వహించే పనిలో ఉన్నారట స్టార్ మా నిర్వాహకులు. అయితే ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. కానీ తారక్ ఉండడని వేరొక హీరో రాబోతున్నాడు అని కామెంట్స్ వినబడుతున్నాయి.

అతను ఎవరో కాదు న్యాచురల్ స్టార్ నాని. అతి తక్కువ కాలంలో తన సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు నాని. ఇక ఎప్పుడు చూసినా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు.నాని సినిమాలో పాత్రలు కూడా చాలా నవ్విస్తాయి. నెగిటివ్ టాక్ లేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో నాని హోస్ట్ చేస్తే కూడా చాలా బావుంటుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం నాని వరుస హిట్స్ తో దూసుకెళుతున్నాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,