Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2016 11:45:16
facebook Twitter Googleplus
Photo

అంకుశం వంటి సినిమాతో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ అన్న పేరు తెచ్చుకున్న విలక్షణ నటుడు ?రాజశేఖర్?. అలాంటి నటుడు ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడంలేదు. పైగా వస్తున్న అరకొర అవకాశాలు కూడా ఏవో కారణాల వల్ల చేజారిపోతున్నాయి. ఇటీవలే దర్శకుడు తేజా ?అహం? సినిమాలో చేయాల్సి ఉండగా ఓ వివాదం కారణంగా రాజశేఖర్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ఈ యాంగ్రీ యంగ్ మేన్ కు మరో మంచి అవకాశం వచ్చింది.
ఈ మధ్యే ?గుంటూరు టాకీస్? సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు ?ప్రవీణ్ సత్తారు? ?డై హార్డ్? అనే హాలీవుడ్ సినిమాకు ఫ్రీ మేక్ గా ఓ పోలీస్ డ్రామాను తెరకెక్కించనున్నాడు. ఇందులో కూడా డై హార్డ్ ఒరిజినల్ వర్షన్ లో నటుడు ?బ్రూస్ విల్లీస్? పాత్రను పోలిన ఓ పోలీస్ పాత్ర ఉందట. ఆ పాత్రను రాజశేఖర్ చేయనున్నాడట. ఈ పాత్రతో రాజశేఖర్ కు అంకుశం సినిమాతో వచ్చిన కీర్తి మళ్లీ తిరిగివస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.

,  ,  ,  ,  ,  ,