Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Oct-2016 10:49:27
facebook Twitter Googleplus
Photo

దేశంలో అవినీతి.. దాని మూలంగా పేరుకుపోతున్న బ్లాక్ మనీ.. సినిమా మేకర్స్ కి ఇదో క్రేజీ సబ్జెక్ట్. అప్పుడెప్పుడో పాతికేళ్లకు పూర్వమే శంకర్ తీసిన జెంటిల్మన్ నుంచి తాజాగా రిలీజ్ అయిన ఇజం వరకూ.. అరగదీసిన సబ్జెక్టే అయినా.. ఇరగదీసేసే పొటెన్షియల్ ఉన్న టాపిక్. కాకపోతే కరెక్టుగా హ్యాండిల్ చేయడం అన్నదే పాయింట్.

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఠాగూర్.. శంకర్ తీసిన అపరిచితుడు.. రజినీకాంత్-శంకర్ ల కాంబినేషన్ లో శివాజీ.. ఇలా బ్లాక్ మనీ కాన్సెప్ట్ లో వచ్చిన భారీ సినిమాల లెక్క ఎక్కువే. పూరీ ఈ సబ్జెక్ట్ ని సెలక్ట్ చేసుకుని.. దానికి జర్నలిస్టిక్ లింక్ పెట్టడంతోనే బోలెడంత కమర్షియల్ లుక్ ఇజంకు వచ్చేసింది. కానీ ఆ టాపిక్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాస్ సినిమాలను ఇరగదీసే రేంజ్ లో తీసే పూరీ అంతగా పట్టు చూపించలేకపోయాడు. తనకు అలవాటైన జోనర్.. హీరోయిన్ ను టీజ్ చేయడం- ఫైట్లు-ఛేజింగ్ లు వరకూ బాగానే మెప్పించినా.. అవినీతి అన్న పాయింట్ దగ్గరే పూరీ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడేమో అనిపిస్తుంది.

వికీ లీక్స్.. పనామా పేపర్స్ వంటి న్యూస్ నుంచి రాసుకున్న థీమ్.. ఇజంలో ఆకట్టుకుంటుంది. కానీ దాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించడం విషయంలో మాత్రం ఓ శంకర్ రేంజ్ లో కానీ.. మురుగదాస్ టైపులో కానీ ఒప్పించడంలోనే అసలు సమస్యంతా వచ్చిందా అనిపించక మానదు. మొత్తానికి ఇజంలో మెచ్చుకోదగిన పాయింట్స్ ఉన్నా.. మెప్పు పొందే రేంజ్ లో లేకపోవడమే అసలు సమస్యంతా!

,  ,  ,  ,  ,