Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jul-2017 11:22:28
facebook Twitter Googleplus
Photo

లేటెస్ట్ మూవీ నిన్ను కోరి రిలీజ్ అయిపోయింది. అంచనాలకు మించిన వసూళ్లతో బాగానే ఇంప్రెస్ చేస్తోందని చెప్పాలి. మౌత్ టాక్ కూడా బాగుండడంతో అంతకంతకూ వసూళ్లు పెరుగుతున్నాయి తప్ప.. ఎక్కడా తగ్గడం లేదు. మల్టీప్లెక్స్.. ఏ..బీ..సీ అనే సెంటర్స్ తో సంబంధం లేకుండా నిన్నుకోరి వర్కవుట్ అవుతోంది. అయితే.. మరి నాని ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందనేకదా మీ డౌట్?

సెంటర్లతో సంబంధం లేకుండా వసూళ్లు సాధించేయడం అనే పాయింట్ దగ్గరే.. న్యాచురల్ స్టార్ కి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్ను కోరి ప్రచారంలో భాగంగా నాని అండ్ టీం కొన్ని సార్లు ఓ తరహా కామెంట్స్ చేశారు. నిన్ను కోరి మూవీ క్లాస్ మూవీ అనే సంగతి ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు నాని. అయితే.. ఈ జోనర్ కారణంగా మాస్ ఆడియన్స్ కు.. అంటే బీ సీ సెంటర్ల జనాలకు పెద్దగా నచ్చకపోవచ్చేమో అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాల్టీ వేరుగా ఉంది. ఏరియాలతో సంబంధం లేకుడా కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయి.

తన అంచనా తప్పు కావడం.. మాస్ ఆడియన్స్ క్లాస్ సినిమాలు మెచ్చరనే భావన వెలిబుచ్చడంపై నాని సారీ చెప్పాడు. నిజానికి ఇది కేవలం నాని ఉద్దేశ్యమే కాదు.. మొత్తం తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇలాంటి భావనలోనే ఉంటుంది.

,  ,  ,  ,  ,