Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jan-2015 10:38:11
facebook Twitter Googleplus
Photo

రవితేజ నటిస్తున్న 'కిక్ 2' చిత్రం యూనిట్ త్వరలో షూటింగ్ కోసం హంపి వెళ్లనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవలే రాజస్థాన్ లోని జైసల్మార్ లో చిత్రీకరించారు. అక్కడి నుంచి రాగానే హైదరాబాదులో షూటింగ్ చేస్తున్నారు. ఈ వారాంతం వరకు ఇక్కడే చేసి, ఆ తర్వాత హంపికి షిఫ్ట్ అవుతారు. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. చిత్రంలోని ప్రధాన తారాగణం ఆ షూటింగులో పాల్గొంటారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ ఇటీవల తీసిన 'పటాస్' సినిమా హిట్టవడంతో, ఇప్పుడీ చిత్రం విషయంలో దర్శకుడిపై ఒత్తిడి మరింత పెరిగిందని అంటున్నారు.

,  ,  ,  ,  ,