Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 14:23:07
facebook Twitter Googleplus
Photo

నిర్మాతగా దిల్ రాజు స్టాండర్డ్స్ ఏంటో అందరికీ తెలుసు. గత కొంత కాలంగా మాత్రం సరైన హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్న దిల్ రాజుకి.. లేటెస్ట్ మూవీ కోట్లు కురిపిస్తోంది. ప్రస్తుతం మెగా సుప్రీం స్టార్ సాయిధరం తేజ్ తో ఈ నిర్మాత తీసిన సుప్రీమ్ మూవీ బిజినెస్ ఫిగర్స్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ఇప్పటికే సుప్రీం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ పూర్తయిపోయింది. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా 24 కోట్లకు బిజెనెస్ చేశాడట దిల్ రాజు. సాయిధరం తేజ్ లాంటి కుర్ర హీరో సినిమాకి ఈ ఫిగర్ చాలా పెద్ద మొత్తం. అయితే గతంలో పటాస్ లాంటి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వం కావడంతో.. మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మెగాస్టార్ సాంగ్ 'అందం హిందోళం' సాంగ్ ను తేజు రీమిక్స్ చేయడం కూడా బాగా కలిసొచ్చిందని అంటున్నారు. అయితే ఈ 24 కోట్ల బిజినెస్ మొత్తాన్ని కనుక రాబట్టగలిగితే.. టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఓ రేంజ్ కి వెళ్లిపోతాడు తేజు. దిల్ రాజు పబ్లిసిటీ టెక్నిక్స్ అనిల్ రావిపూడి డైరెక్షన్ మెగా ఫ్యాన్స్ అండ రాశి ఖన్నా గ్లామర్.. ఇవన్నీ చూస్తుంటే.. ఈ అమౌంట్ రికవర్ చేయడం కష్టంకాకపోవచ్చనే అంచనాలున్నాయి.

,  ,  ,  ,  ,