Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Nov-2017 12:21:18
facebook Twitter Googleplus
Photo

సినిమా సినిమాకూ ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతున్న నేచురల్ స్టార్ నాని.. ఆల్రెడీ నిర్మాతగా ఒక సినిమా చేశాడు. హిందీలో సినిమాలు తీసే దర్శక ద్వయం రాజ్-కృష్ణలతో కలిసి అతను డి ఫర్ దోపిడీ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఐతే అందులో నాని నామమాత్రపు పెట్టుబడే పెట్టాడు. ఆ సినిమాలో అతను లేటుగా జాయినయ్యాడు కూడా. ఆ సినిమా అతడికి నిరాశనే మిగిల్చింది. ఐతే ఇప్పుడు నాని పూర్తి స్థాయి నిర్మాతగా మారిపోవడం విశేషం. ఎవరికీ చెప్పకుండా వాల్ పోస్టర్ సినిమా అనే బేనర్ మొదలుపెట్టి.. ఆ బేనర్లో తొలి సినిమాను దాదాపుగా పూర్తి చేసేయడం కూడా అయిపోయిందట. శనివారం రాత్రే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు నాని ప్రకటించాడు.

ఈ ఏడాది ఆరంభంలో ప్రశాంత్ అనే కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు. ఒక కథ చెప్పి.. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగాడు. ఆ తర్వాత ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారని అడిగాను. ఇంకా ఎవరూ దొరకలేదని.. ఎలాగోలా మేనేజ్ చేస్తానని అన్నాడు. ఐతే తెలుగు ప్రేక్షకులు ఇంతవరకూ ఇలాంటి కథతో సినిమా చూసి ఉండరు. అలాంటి కథకు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి.. నేనే ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాను. ప్రశాంత్ కూడా నాతో కలిశాడు. ఆ తర్వాత ఎంతోమంది నటీనటులు.. టెక్నీషియన్లు ఈ కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చారు. అందరం కలిసి సినిమా చేసేశాం. దాదాపుగా పూర్తి కావచ్చింది. 80 శాతం సినిమా రెడీ అయింది. ఇంకో 20 శాతమే మిగిలింది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. రిలీజ్ డేట్ దగ్గర పడింది కాబట్టి.. ఇక టైటిల్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది.

,  ,  ,  ,