Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2016 12:49:37
facebook Twitter Googleplus
Photo

నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ఎవడే సుబ్రమణ్యం నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన జెంటిల్‌మన్ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమా ?మజ్ను?ను విడుదలకు సిద్ధం చేయడమే కాక, మరో సినిమాను కూడా మొదలుపెట్టేశారు. ?సినిమా చూపిస్త మావా? ఫేం త్రినాధరావు నక్కిన తెరకెక్కించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు వైభవంగా ప్రారంభమైంది.
నాని స్టైల్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకు ?నేను లోకల్? అన్న టైటిల్‌ను ఖరారు చేసేశారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా, తమ సంస్థకు, నానికి మంచి పేరు తెస్తుందని ప్రారంభోత్సవం సందర్భంగా దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నాని సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు. ఇక నాని నటిస్తోన్న ?మజ్ను? సినిమా విషయానికి వస్తే, విరించి వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది

,  ,  ,  ,  ,  ,