Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 12:28:56
facebook Twitter Googleplus
Photo

నువ్వే కావాలి లాంటి రొమాంటిక్ సినిమాలతో టాలీవుడ్ లవర్ బోయ్ గా మారిపోయాడు తరుణ్. అయితే.. వరుస ఫ్లాపులు రావడం.. మరి కొన్ని కెరీర్ డిస్టర్బెన్స్ ల కారణంగా ఈ కుర్రాడు లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. అయితే.. తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తానని మాత్రం గతంలోనే చెప్పాడు.

చెప్పినట్లుగానే ఓ సినిమాను అనౌన్స్ చేశాడు కూడా. సెప్టెంబర్ 2015లో 'ఇది నా లవ్ స్టోరీ' అనే మూవీని అధికారికంగా ప్రారంభించాడు తరుణ్. అప్పుడే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశాడు. గతేడాది మధ్యలో ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది కానీ.. అక్కడి నుంచి ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా ఈ మూవీ గురించి తెలియరాలేదు. కారణం తెలియదు.. అసలు సినిమా ఏమైందో కూడా తెలియని పరిస్థితి. తమిళ నటి ఓవియా హెలెన్ ను ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం చేయనున్నారు.

కన్నడలో సూపర్ హిట్ అయిన సింపుల్ అగి ఒండు లవ్ స్టోరీ అనే మూవీకి రీమేక్ గా తరుణ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. షూటింగ్ అయిపోయిందంటూ.. గతేడాది ఆడియో ఫంక్షన్ చేయబోతున్నట్లు కూడా నిర్మాతలు చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాను తాత్కాలికంగా ఆపేయడానికి కారణంగా డీమానిటైజేషన్ ను చెబుతున్నారు. ప్రస్తుతానికైతే.. ఈ చిత్రం అసలు థియేటర్లలోకి వస్తుందో రాదో కూడా చెప్పలేమని ఇండస్ట్రీ టాక్.

,  ,  ,  ,  ,