Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 10:17:44
facebook Twitter Googleplus
Photo

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరపై ఎటాక్ చేసిన ముద్దుగుమ్మ అదా శర్మ. అమ్మడి అదృష్టం ఏమిటో గాని చూడటానికి అందరికి నచ్చేలా ఉన్నా ఛాన్సులు మాత్రం అంత పెద్దగా రాలేవు. కనీసం బాలీవుడ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఉండే రోల్స్ అయినా చేసింది. కానీ తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమా తప్ప ఎందులోను సరైన పాత్ర లభించలేదు.

ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి - సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ రెండు చిత్రాల్లో చిన్న పాత్రలే వచ్చాయి. ఇక క్షణం సినిమాలో నటనతో ఆకట్టుకున్నా అదా శర్మ కి టాలీవుడ్ లో మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేవు. కాని బాలీవుడ్ కామాండో సినిమాలో మాత్రం హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా కూడా అదా కి అదృష్టాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా అమ్మడికి నెస్కేఫ్ లాంటి బ్రాండ్ కాఫీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యింది. ఇలాంటి బ్రాండెడ్ కంపెనీలో బాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని. తప్పకుండా ఈ లుక్ లో మీకు నచ్చుతనని చెబుతూ.. మొదటి సారి ఇలాంటి కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నానని చెప్పింది.

అలాగే ఈ యాడ్ లో తనే తెలుగు - మలయాళం డబ్బింగ్ చెబుతున్నా అని వివరించింది.

,  ,  ,  ,  ,  ,  ,