Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2014 11:05:16
facebook Twitter Googleplus
Photo

హెడ్డింగు చూసి 'వారెవా... అనుష్క అందాలను జీరో సైజులో చూడచ్చన్న మాట' అనుకునేరు ... అది కాదులెండి. ఆమె నటించనున్న ఓ చిత్రం కోసం ఈ 'జీరో సైజ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. 'అనగనగా ఓ ధీరుడు' చిత్రాన్ని రూపొందించిన ప్రకాష్ కోవెలమూడి (రాఘవేంద్రరావు తనయుడు) అనుష్కతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం కోసమే ఈ టైటిల్ని అనుకుంటున్నారట. విశేషం ఏమిటంటే, ఇందులో అనుష్క టైటిల్ కి భిన్నంగా ఫ్యాటీగా వంద కిలోల బరువుతో కనిపిస్తుందని సమాచారం. ఏమైనా, టైటిల్ మాత్రం తమాషాగా వుంది కదూ!

,  ,  ,  ,