Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 13:07:53
facebook Twitter Googleplus
Photo

మిస్ ఇండియా 2015 అదితి ఆర్య.. సినీ అరంగేట్రం చేస్తోంది. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ఇజం మూవీతో కళ్యాణ్ రామ్ కి జోడీగా సినిమా రంగంలో ప్రవేశిస్తోంది అదితి. ముంబైలోని ఓ ఏజన్సీ ద్వారా ఈవిడ ప్రొఫైల్ పూరీ చేతుల్లోకి వెళ్లిందట. అయితే.. ఆమె చేతికి పేద్ద స్క్రిప్ట్ ఇచ్చినా.. అదితి మాత్రం యూట్యూబ్ లో తెలుగు నుంచి హిందీలోకి డబ్ అయిన సినిమాలు చూసి.. తెలుగు సినిమా గురించి తెలిసేసుకుందట.

'ఇక్కడి సాంగ్స్.. మ్యూజిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కాలేజ్ రోజుల్లో థియేటర్లలో డ్యాన్సులు వేసినప్పటి అనుభవాన్ని గుర్తు చేసుకుని మరీ చిందులేశా' అంటున్న అదితి ఆర్య.. దర్శకుడు పూరీ జగన్నాధ్ చాలామంది హీరోయిన్ల ఫేట్ మార్చేశాడని తనకు తెలుసని.. తన విషయంలో కూడా మంచి ఫౌండేషన్ పడుతుందని ఆశిస్తున్నట్లు చెబుతోంది. మొదట్లో తెలుగు డైలాగ్స్ చెప్పడం బాగా ఇబ్బందిగా అనిపించేదట కానీ.. రాన్రాను తన డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయడంతో.. మెల్లగా అలవాటు పడిపోయిందట అదితి.

ఇక వన్ ఫిలిం వండర్ టైపులో ఇక్కడి నుంచి చెక్కేయాలని ఈ మిస్ ఇండియా అనుకోవడం లేదట. కొన్నేళ్ల పాటు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పిన అదితి.. అది జరగాలంటే తన తొలి మూవీ సక్సెస్ సాధించడం ముఖ్యం అని తెలుసంటోంది. కమర్షియల్ మూవీస్ నుంచి.. ఆర్టిస్టిక్.. ఆఫ్ బీట్ సినిమాలు కూడా తన కెరీర్ లో ఉండాలని కోరుకుంటున్న అదితి ఆర్య.. టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో చేసేయాలని ఉందంటూ.. తెలివి కూడా చూపించేసింది.

,  ,  ,  ,  ,