Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Dec-2016 12:41:49
facebook Twitter Googleplus
Photo

సింగిల్ నెంబర్ సాంగ్స్ తో ఖైదీ నెంబర్ 150 యూ ట్యూబ్ లో హంగామా చేస్తున్న సంగతి తెలిసినదే. మొదటిగా విడుదల చేసిన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు రీసెంట్ గా 7మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేస్తే ఇటీవల విడుదల చేసిన యు అండ్ మీ ఆనతికాలంలోనే మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఈ కాన్సెప్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాలో వున్న ఐటెం సాంగ్ ని కూడా ఇదే పద్ధతిలో విడుదలచెయ్యడానికి నిర్ణయించారు. అది కూడా కొత్త సంవత్సర కానుకగా అభిమానులకు అందించడం విశేషం. ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన ఐటెం సాంగ్ లో నటి లక్ష్మిరాయ్ చిందేసిన సంగతి తెలిసినదే. రత్తాలూ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ రచ్చ లేపుతుందని అందరూ భావిస్తున్నారు. దేవి ఎలానో ఐటెం సాంగుల స్పెషలిస్ట్ గాబట్టి అంచనాలు మరింత పెరగడం సహజం.

ఇక ఐదవపాట సిట్యుయేషనల్ సాంగ్ కాబట్టి డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసే అవకాశం వుంది. ఈ ఈవెంట్ జనవరి 4న విజయవాడలో ఘనంగా జరగనుంది. మీ అన్నయ్యని మీ బాస్ ని తిరిగి చిత్రసీమకి ఆహ్వానించమని చరణ్ ఇప్పటికే సందేశంపంపడం తెలిసినదే.

,  ,  ,  ,  ,