Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 16:05:41
facebook Twitter Googleplus
Photo

(నవ్వుతూ) ఇదో ఊహించని ప్రయాణం అనుకోవాలి. ఢిల్లిలో సైలెంట్ గా సాఫ్ట్ ఇంజినీర్ గా వర్క్ చేసుకుంటున్న టైమ్ లో అనుకోకుండా నటిగా మారాను. సరే హీరోయిన్ గా సౌత్ లో బిజీగా ఉన్న టైమ్ లో నార్త్ నుంచి ఛాన్స్ లు వచ్చాయి. ఇది కూడా అనుకోకుండానే జరిగింది. బాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. తెలుగు - తమిళంలో సైతం బిజీగా ఉన్నా. ఇదంతా డెస్టినీ అనుకోవడమే. లక్ అండ్ హార్డ్ వర్క్ తో మీరు అన్నట్లుగా నా షటిల్ సర్వీస్ బాగానే నడుస్తుంది(మళ్లీ నవ్వులు).

* తాప్సీ ఓ హైపర్ పిల్ల అనే టాక్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఎందుకలా?

ఎందుకో మీరే చెప్పాలి. హైపర్ అని అనుకోవడం లేదు కానీ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రపోయే వరుకు ఫుల్ ఎనర్జీతో ఉంటున్నా. ఇది నాకు ఓ మూడేళ్ల నుంచి అలవాటైంది. మొదట్లో నాకు రెండు ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉండేది. ఒకటి ఏడుపు మరొకటి నవ్వు. ఈ రెండు హావభావాలే పలికి పలికి నాకు బోర్ కొట్టేసింది. జనాలు కూడా నా నుంచి కొత్తదనం కోరకుంటున్నారని అని నాకు అర్ధమైంది. అందుకే యాక్షన్ కామెడీ ఇలా కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేశా. నాకు సైతం ఈ మార్పు చాలా సంతృప్తిని ఇస్తోంది. అయితే కొందరు నాలో వచ్చిన ఈ మార్పులు గమనించి నేనే ఏమైనా ప్లాస్లిక్ సర్జరీ చేయించుకున్నాన అని అడిగారు. మీరే చెప్పండి ప్లాస్టిక్ సర్జరీ చెయించుకుంటే ఎనర్జీ వస్తుందా. ఏమైనా సరే ఈ మార్పుతో నేనే హ్యపీగా ఉంటున్నా.

* గ్లామర్ కి దూరంగా వెళ్తున్నారు మరి మాస్ దూరం అవుతా అనే భయం లేదా?

మొదట్లో నా అందాన్ని ఆదరించిన మాస్ ఆడియెన్స్ ఇప్పుడు నా ఫైట్లుని ఆదిరిస్తున్నారు(మళ్లీ నవ్వులు). స్కిన్ షో చేస్తే అవకాశాలు ఎక్కువ వస్తాయి డబ్బులు ఎక్కువ వస్తాయి మొదట్లో నేను అదే ఫాలో అయ్యాను. కానీ ఎన్నాళ్లు ఇలా అనిపించింది. పంజరంలో పాటలు పాడే చిలకలా నేను ఇక ఉండకూడదు అని ఫిక్స్ అయ్యాను. అందుకే కరాటేలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా సినిమాల్లో విలన్లు తాట తీస్తున్నా ప్రేక్షకులు నాలో కొత్తగా వచ్చిన ఈ మార్పుని ఆదరిస్తున్నారు.

* వుమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇది ఎప్పుడు నుంచి మొదలైంది?

మొదటి నుంచి ఈ భావజాలం నాలో ఎక్కువుగా ఉంది. ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు నా తలిదండ్రులు నన్ను మా చెల్లిని మగబిడ్డల్లానే పెంచారు. దీంతో నాకు ధైర్యం ఎక్కువ. మొదట్లో ఈ విషయంలో బయటికి మాట్లాడేందుకు ఆలోచించేదాన్ని కానీ ఏ విషయంలో నేనే ఏం తక్కువ అనిపించింది. మనకు మనం ధైర్యంగా ఉంటేనే కదా మరొకరు వచ్చి హానీ చేయకుండా ఉండేది. అయితే సినిమాల్లో మేల్ డామినేషన్ ఎక్కువ కొన్నాళ్లు క్రిందట నాకంటే తక్కువ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఓ హీరో పక్కన నేను నటించడానికి ఆ హీరోకి ఇచ్చినంత పారితోషికం అడిగాను. అప్పుడు ఆ హీరోకంటే నా క్రేజే ఎక్కువ అందుకే నేను ఆ విధంగా డిమాండ్ చేశాను. నా వైపు నేను కరెక్ట్ గానే అడిగా అని భావించా కానీ ఆ ప్రొడక్షన్ వాళ్లకి అది నచ్చలేదని తెలిసింది. ఇదో ఉదాహరణ మాత్రమే ఈ సమస్యకి అంతం ఉండదు కానీ ఓ గొంతు ఎల్లప్పూడు ప్రశ్నిస్తూనే ఉండాలి. ఆ గొంతు నేనే ఎందుకు కాకుడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నా.

* ఆనందో బ్రహ్మ ఎలా మొదలైంది?

తెలుగు నుంచి ఏదైనా కొత్త తరహా కథ వస్తే తప్ప సినిమాలు ఒప్పుకోకూడదని ఫిక్స్ అవుతున్న టైమ్ ఆనందో బ్రహ్మ దర్శకనిర్మాతలు నన్ను కలిసారు. డైరెక్టర్ మహిని జానర్ అడిగితే హారర్ కామెడీ అన్నాడు వెంటనే నాకు నీరసం వచ్చేసింది. సర్లే కథ చెప్పడానికి వచ్చాడు కదా అని వినడం స్టార్ట్ చేశా. కట్ చేస్తే కథ నాకు నచ్చింది కానీ సినిమా చేయడానికి కాల్షీట్స్ లేవు వేరే హీరోయిన్ తో చేయండి అని చెప్పి నా పనిలో నేను బిజీ అయిపోయా. ఓ సంవత్సరం తరువాత కాల్ చేస్తే మీ కోసమే స్క్రిప్ట్ లాక్ చేశాము మీరు ఎప్పుడంటే అప్పుడు సినిమా మొదలుపెడతాం అని 70 ఎమ్ ఎమ్ వాళ్లు చెప్పారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక లేట్ చేయకూడదని ఆనందో బ్రహ్మ కోసం హైదరాబాద్ వచ్చేసాను. అలా ఈ కామెడీ హారర్ మొదలైంది.

* రాఘవేంద్రరావుగారి విషయంలో అసలు ఏం జరిగింది?

నేను ఏదో బాలీవుడ్ సినిమా ప్రచారంలో భాగంగా ఓ షోకి వెళ్లాను. అక్కడ నామీద నేనే ఫన్ చేసుకునే ప్రయత్నంలో రాఘవేంద్రరావుగారి గురించి చెప్పాను. అయితే అప్పుడు నేను చెప్పింది ఒకటి మీడియా ప్రచారం చేసింది మరొకటి ఫుల్ వీడియో చూడకుండా కేవలం ఓ పదిహేను సెకన్లు మాత్రమే చూసి దాన్నే తిప్పి తిప్పి నన్ను కాంట్రవర్శీలోకి లాగారు. కాస్త బాధ అనిపించినా నాకు ఇలానే రాసి పెట్టి ఉందేమో అని నాకు నేనే సర్ధిచెప్పుకున్నా. రాఘవేంద్రరావుగారికి కాల్ చేసి క్షమాపణ చెప్పాను. ఆయన కూడా అర్ధం చేసుకున్నారు.

* ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

రేపటి గురించి ఆలోచించడం లేదు నిన్నటి గురించి గుర్తుపెట్టుకోవడం లేదు నేటి గురించి చింతే లేదు ఎందుకంటే మేరా నామ్ షబానా(నవ్వులే నవ్వులు)

,  ,  ,  ,