Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Nov-2017 10:13:33
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య బాలీవుడ్ భామల ఎంట్రీ బాగానే సాగుతోంది. బాహుబలి మహిమో లేక మార్కెట్ రేంజ్ పెంచుకోవాలి అనుకుంటున్నారో గాని హిందీ భామలు తెలుగు పలుకులను చాలా ఇష్టపడుతున్నారు. కథ చెప్పగానే ఏ లిమిట్స్ లేకుండా ఒకే అనేస్తున్నారు. అవసరం అయితే కొంచెం రెమ్యునరేషన్ ని కూడా తగ్గించేసి వస్తున్నారని కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

అయితే రూమర్స్ పై కథనాలు ఈ రోజుల్లో కామన్ కానీ ఒక హీరోయిన్ పై మాత్రం నమ్మే విధంగా రూమర్స్ వచ్చాయి. అవి అబద్ధాల్లో నిజాలో తెలియదు గాని ఆ వార్తల వల్ల అమ్మడి క్యారెక్టర్ ఇదా అనే విధంగా టాక్ కూడా వచ్చింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ అదితి రావ్ హైదరి. అమ్మడి అసలు పుట్టిన ఊరు హైదరాబాద్ అయినా నార్త్ కి వెళ్లి హాట్ హాట్ గా అందాలను అరబోసింది. ఇక అక్కడ చేసి బోర్ కొట్టిందో ఏమో రీసెంట్ గా ఒక తెలుగు సినిమాకు ఒకే చేసింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్సకత్వంలో సుదీర్ బాబు హీరోగా ఒక కొత్త సినిమా తెరకెక్కబోతోంది.

అయితే ఇందులో అదితి రావ్ ని సెలెక్ట్ చేశారు. ఇక రూమర్స్ విషయానికి వస్తే.. అమ్మడు మొదట ఈ సినిమాకు ఒప్పుకోలేదని వార్తలొచ్చాయి. అంతే కాకుండా ఎక్కువగా రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసింది అని చెప్పారు. కానీ ఎన్ని రూమర్స్ వచ్చినా మళ్లీ అమ్మడి సెలెక్ట్ కావడం చూస్తుంటే అవన్నీ అబద్దాలు అని చెప్పవచ్చు.. ఇక అదితి సినిమాలో సెలెక్ట్ అయినందుకు చాలా ఖుష్ అయ్యింది.

,  ,  ,  ,  ,