Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2016 11:09:22
facebook Twitter Googleplus
Photo

అసలు ఏ మాత్రం దువ్వని గెడ్డం.. అలాగే ఏ మాత్రం దువ్వని క్రాఫ్ తో ఇప్పుడు ఎన్టీఆర్ ఒక ఫోటోలో దర్శనమిస్తున్నాడు. ప్రస్తుతం ఏ మీడియాలో చూసినా ఆ ఫోటో గురించే చర్చ.. దాని గురించే రచ్చ. ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడని.. త్వరలోనే ఒక కొత్త లుక్ తో పిచ్చెక్కిస్తాడని.. అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలో తన స్టయిలిష్ అర్బేన్ లుక్ తో టీజ్ చేసినట్లు మరోసారి చంపేస్తాడని టాక్ వచ్చింది. ఇంతకీ ఇదంతా నిజమేనా??

విషయం ఏంటంటే.. అసలు ఎన్టీఆర్ ఫోటో ఇప్పటిది కాదు. అది నాన్నకు ప్రేమతో సినిమాకు ముందు తీసిందే. అప్పట్లో ఫుల్లుగా గెడ్డం పెంచుతున్న సమయంలో అలా ఉన్నాడట మనోడు. ఈ ఫోటో లేటెస్టుది అంటూ మీడియా ప్రముఖులందరూ చర్చిస్తున్న వేళ.. ఇది చాలా పాత ఫోటో అంటూ స్వయంగా ఎన్టీఆర్ పి.ఆర్.ఓ.లే క్లారిటీ ఇచ్చేశారు. కాకపోతే అప్పటికే ఇది ఎన్టీఆర్ కొత్త సినిమా లుక్ అంటూ కొందరు ప్రచారం చేసేశారు కాబట్టి.. వారు చాలా బ్లయిండ్ గా ఇదే కొత్త లుక్ అంటూ వాదించుకుంటూ పోతున్నారు.

ఇకపోతే జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఇంతవరకు ఏ కొత్త సినిమానూ ఒప్పుకోలేదు. ఒక ప్రక్కన అనిల్ రావిపూడి మరో ప్రక్కన వక్కంతం వంశీ కతలు చెప్పినా కూడా అవి నచ్చలేదు. అలాగే పెద్ద దర్శకుల్లో ఇప్పుడు ఎవ్వరూ ఫ్రీగా లేరు. వినాయక్ తో ''అదుర్శ్ 2'' చేసే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయనేది ఒక టాక్. అది సంగతి.

,  ,  ,  ,