Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2016 11:01:08
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ హిస్టరీలో ఐశ్వర్యా రాయ్ స్థానం ప్రత్యేకం. దశాబ్దానికి పైగా హిందీ సినిమాను ఏలింది ఐష్. ఇక్కడున్న స్టార్ హీరోలందరితో నటించిందామె. ఎన్నో సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంది. కానీ ఇప్పటిదాకా ఆమెకు ఒక కోరిక మాత్రం తీరలేదు. అదే.. తాను నటించిన సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించడం. గత కొన్నేళ్లలో వంద కోట్ల సినిమా అన్నది బాలీవుడ్ వాళ్లకు చాలా సింపుల్ అయిపోయింది. కానీ పెళ్లి చేసుకోవడం వల్ల ఐష్ నాలుగైదేళ్లుగా సినిమాల్లో నటించట్లేదు. ఆమె హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్నపుడు కూడా వందకోట్ల సినిమాలున్నాయి కానీ.. అలాంటి ఐష్ సినిమాలేవీ ఆ ఘనత సాధించలేదు.

ఐతే ఈ ఏడాదే సినిమాల్లోకి పునరాగమనం చేసిన ఆమె.. ఎట్టకేలకు వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టింది. జాజ్బా.. సరబ్జీత్ సినిమాలు కలెక్షన్లలో వెనుకబడ్డా.. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఐష్ నటించిన ?యే దిల్ హై ముష్కిల్? వంద కోట్ల కలెక్షన్లు సాధించి.. ఐష్ కల నెరవేర్చింది. ఈ సినిమా వసూళ్లు రెండో వారంలో రూ.100 కోట్ల మార్కును దాటాయి. అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ. 104.86 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లోనే ఈ సినిమా రూ.73.42 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. విశేషం ఏంటంటే.. కరణ్ జోహార్ కు కూడా ఇది తొలి వంద కోట్ల సినిమా. ?ఏ దిల్ హై ముష్కిల్?కు రణబీర్ కపూర్-ఐశ్వర్యా రాయ్ ల కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం అనుష్క శర్మ మరో కథానాయికగా నటించింది. రణబీర్ కపూర్ నటించిన సినిమా వందకోట్లు దాటడం ఇది మూడోసారి. యే జవానీ హై దీవానీ.. బర్ఫీ కూడా ఈ ఘనత సాధించింది. అనుష్క శర్మకు ఇది నాలుగో వంద కోట్ల సినిమా. ఆమె నటించిన జబ్ తక్ హై జాన్.. పీకే.. సుల్తాన్ భారీ కలెక్షన్లు సాధించాయి.

,  ,  ,  ,  ,