Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 11:56:20
facebook Twitter Googleplus
Photo

క‌బాలికి ముందు రంజిత్ పా.. పేరు మార్మ్రోగిపోయింది. కుర్రాడైనా ర‌జ‌నీతో సినిమా ఛాన్స్ భ‌లే ప‌ట్టేశాడ‌ని రంజిత్ గురించి గొప్ప‌గా చెప్పుకొన్నారు. కొత్త ద‌ర్శ‌కుడు అని కూడా చూడ‌కుండా ర‌జ‌నీకాంత్ అవ‌కాశం ఇచ్చాడంటే.. అద్భుత‌మైన క‌థేదో చెప్పుకొంటాడ‌ని అంచ‌నాలు వేసుకొన్నారు. కానీ సినిమా చూసి అంద‌రూ రంజింత్‌ని తిట్టుకోవ‌డ‌మే. ర‌జనీలాంటి సూప‌ర్ స్టార్ అవ‌కాశం ఇస్తే ఇలాంటి సినిమా తీస్తాడా? అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడీ విమర్శలపై స్పదించాడు రంజిత్. ?కబాలి సినిమాను వీలైనంత రియలిస్టిగ్గా తీయాలని ముందునుంచే అనుకున్నాం. సినిమాలో అందుకే అనవసర ఆర్భాటాలేవీ లేకుండా చూసుకున్నాం. రజనీ సార్ ఇమేజ్‌ను మాత్రమే క్యాష్ చేసుకునేలా కొన్నాళ్ళుగా సినిమాలు వచ్చాయి. నేను అందుకు భిన్నంగా ఆయనలోని అద్భుతమైన నటుడిని బయటకు తేవాలని ప్ర‌య‌త్నించాను. కమర్షియల్ సినిమాల్లో ఎక్కువ‌గా అబద్ధాలు చెబుతుంటాం. అలాంటి సినిమాలు నావల్ల కాదు??అని సమర్ధించుకున్నాడు రంజిత్.

,  ,  ,  ,  ,