Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2015 17:08:22
facebook Twitter Googleplus
Photo

దసరాకు పక్కా అనుకుంటుండగా రిలీజ్ డేటుకి సరిగ్గా వారం ముందు.. ?అఖిల్? సినిమాను వాయిదా వేసేసి అక్కినేని అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేశారు. నితిన్ నమ్మకద్రోహం చేశాడని.. వినాయక్ కుట్ర చేశాడని అక్కినేని ఫ్యాన్స్ ఆందోళనలూ అవీ చేశారు కానీ.. వాస్తవానికి సినిమాను వెనక్కి తోసింది నాగార్జున. గ్రాఫిక్స్ విషయంలో అభ్యంతర పెట్టింది ఆయనే. ఐతే మరీ ఎక్కువ వర్కేమీ లేదని.. ఔట్ పుట్ సరిగా రాని గ్రాఫిక్ వర్క్ మళ్లీ చేస్తున్నారని.. అందులో ఇంకో 25 శాతం మాత్రమే పెండింగ్ ఉందని.. కొన్ని రోజుల్లోనే పని పూర్తయిపోతుందని.. అతి త్వరలో రిలీజ్ డేట్ ఇస్తామని నాగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

నాగ్ అన్నట్లే.. ?అఖిల్? రిలీజ్ డేట్ విషయంలో మరీ ఆలస్యమేమీ కావట్లేదు. దసరా కాకుంటే దీపావళి అని అభిమానులు అనుకున్నట్లే.. తర్వాతి పండక్కి సినిమా వచ్చేస్తోందని సమాచారం అందుతోంది. దీపావళి సందర్భంగా నవంబరు 11న ?అఖిల్?ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజుకు మరే తెలుగు సినిమా కూడా పోటీలో లేదు. ముందు వారం బెంగాల్ టైగర్ - శంకరాభరణం విడుదల కాబోతున్నాయి. కాకపోతే దసరా సందర్భంగా ఉన్న సెలవుల అడ్వాంటేజి మాత్రం ?అఖిల్? మిస్ అవుతోంది. ఐతే సినిమా మీద హైప్ బాగానే ఉంది కాబట్టి సినిమా బాగుంటే ఎప్పుడొచ్చినా ఇబ్బందేమీ లేదు.

,  ,  ,