Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 10:52:09
facebook Twitter Googleplus
Photo

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల ప్రస్థానం కోట శ్రీనివాసరావుది. తమిళ.. హిందీ భాషల్లోనూ ఆయన నట ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆయన నట ప్రస్థానంలో ఎన్నో మలుపులున్నాయి. వాటి గురించి ఒక మ్యాగజైన్లో సీరియల్ వస్తోందిపుడు. తన కెరీర్లోనే ఆసక్తికర విశేషాల గురించి వారం వారం వెల్లడిస్తున్నారు కోట. ఈ వారం కెరీర్ ఆరంభంలో కృష్ణం రాజు సొంత బేనర్లో చేసిన ?తాండ్ర పాపారాయుడు? సినిమాకు పారితోషకం తీసుకునే విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించారు కోట.

??తాండ్ర పాపారాయుడు సినిమాకు 12-13 రోజులు పని చేశాను. గోపీకృష్ణ ఆఫీసుకుని నన్నో రోజు పిలిచారు. కృష్ణంరాజు గారి బ్రదర్ సూర్యనారాయణ రాజు (ప్రభాస్ తండ్రి) అక్కడున్నారు. అతిథుల్ని సత్కరించడంలో గోపీకృష్ణ వాళ్ల తీరే వేరు. నన్ను కూడా అలాగే గౌరవించారు. మర్యాదలన్నీ అయ్యాక పారితోషకం గురించి అడిగారు సూర్యనారాయణ రాజు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంటుగా ఉండిపోయాను. అంతలో కృష్ణం రాజు గారు వచ్చారు. కుశల సమాచారం.. కెరీర్ గురించి అడిగారు. తర్వాత ఏంటి కంగారుగా ఉన్నావ్ అని అడిగారు. సూర్యనారాయణ రాజు అసలు విషయం చెప్పాడు. దీంతో ఆయన డబ్బులు తీసుకోవడానికి ఇబ్బందేంటి అన్నారు. ఐతే ఎంత తీసుకోవాలో తెలియట్లేదని.. మిగతా సినిమాల విషయంలోనూ ఈ ఇబ్బందే ఉందని.. మీరు ఎంతో కొంత ఫిక్స్ చేసి ఇస్తే.. ఆ ప్రకారమే అందరి దగ్గరా తీసుకుంటానని చెప్పాను. ఆయన 20 వేలు తీసుకోమన్నారు. తాము ముచ్చటపడి ఈ మొత్తం ఇస్తున్నామని.. బయట అయితే 15 వేలు తీసుకోమని చెప్పారు. అప్పట్నుంచి 10 రోజులకు పైన డేట్లిస్తే రూ.15 వేలు తీసుకోవడం మొదలుపెట్టా?? అని కోట చెప్పారు.

,  ,  ,  ,  ,  ,