Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 12:37:21
facebook Twitter Googleplus
Photo

ఇంతకీ అఖిల్ అక్కినేని రెండో సినిమా ఎవరితో? దాని గురించి కింగ్ నాగార్జున 'ఊపిరి' సినిమా సక్సెస్ కమ్ థ్యాంక్యూ మీట్ లో వెల్లడిస్తారని మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. అనుకున్నట్లే నాగ్ తన మాటను నిలబెట్టుకున్నారు. అయితే ఇక్కడో పంచ్ ఉంది.

మరో వారంలో తిరుపతి వెంటేశ్వరస్వామి దగ్గరకు కి వెళ్లి హథీరాంబాబాపై కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాను అని సెలవిచ్చారు నాగ్. అయితే అందుకు ఇంకా రెండు నెలలు టైమ్ పడుతుంది. ఎందుకంటే ఆయన గెడ్డం పెంచి ఆ సినిమా షూట్ కు రెడీ అవ్వడానికి ఆ టైమ్ కావాలట. అయితే ఈ రెండు నెలల్లోనే తనకు అసలైన పని ఇంకోటి ఉందట. ''ఈ రెండు నెలల్లో కళ్యాణ్ కష్ణ - నాగచైతన్యతో ఓ సినిమా మొదలు పెట్టడం.. వంశీ అండ్ అఖిల్ ను కూర్చోపెట్టి కథను ఫైనల్ చేయించడం కూడా చేయాలి. ఇప్పటివరకు నా ఇద్దరబ్బాయిల మీద మనసు పెట్టలేదు. ఈ ఏడాది మాత్రం అదే పని. ఇదే అక్కినేని అభిమానులకు ఇచ్చే ప్రామిస్'' అని సెలవిచ్చారు నాగ్.

అంటే అఖిల్ కొత్త సినిమా గురించి తెలియడానికి ఇంకా రెండు నెలలు పడుతుందనమాట. ఛలో.. వెయింటింగే మరి.

,  ,  ,  ,  ,