Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2017 10:36:38
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం హీరోయిన్స్ మధ్య పోటీ చాలా పెరిగిపోయింది. ఒక్క హిట్ వస్తే వరుస ఆఫర్స్ ని అందుకుంటున్నారు. అయితే అదే తరహాలో అపజయాలు వస్తే మాత్రం అక్కడే ఆగిపోతున్నారు. ప్రస్తుతం రకుల్ పొజిషన్ కూడా అలానే ఉంది. అమ్మడు గత ఏడాది వరుసగా మూడు విజయాలను అందుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం రిలీజ్ అయినా నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు డిజాస్టర్ అవ్వగా రారండోయ్ వేడుక చూద్దాం మాత్రం పర్వాలేదు అనిపించింది.

దీంతో రకుల్ కెరీర్ పై చాలా అనుమానాలు రేగుతున్నాయి. ముఖ్యంగా స్పైడర్ సినిమాలో అమ్మడి పాత్ర పాటల వరకే పరిమితమయ్యింది. అయినా ఆ సినిమా ఏ మాత్రం లాభం చేకూర్చలేదు. ఇక రకుల్ కి అవకాశాలు రావడం కష్టమేనని రూమర్స్ బాగా వినిపించాయి. కానీ అమ్మడి గ్లామర్ వల్ల ఓ అదృష్టం తలుపు తట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో రకుల్ ని అనుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ తో అమ్మడు నాన్నకు ప్రేమతో సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మళ్లీ తారక్ సరసన ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో రకుల్ ని ప్రజెంట్ చేయాలనీ త్రివిక్రమ్ అనుకుంటున్నారట. తారక్ కూడా ద్రుష్టి కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో సినిమాలు అంతగా ఏమి లేవు. చివరగా కార్తితో నటించిన ఖాకి సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది.

,  ,  ,  ,  ,  ,