Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2015 13:49:44
facebook Twitter Googleplus
Photo

ఇంతకీ 'అఖిల్' సినిమా ఒక సోషియో ఫాంటసీ కదా?? సినిమా పోస్టర్లలో అఖిల్ చేతిలో ఒక రగిలే గోళం ఉండటంతో.. అందరూ ఇదో సోషియో ఫాంటసీ కథే అని బలంగా నమ్ముతున్నారు. హీరోకి కొన్న అతీంద్రియ శక్తులు ఉంటాయని.. తొలి హాఫ్ లో వాటి గురించి తెలియని హీరో.. హీరోయిన్ ద్వారా అవి తెలుసుకుంటాడని.. ఆ తరువాత ఇక లోక కల్యాణం కోసం వాటిన వాడతాడని టాక్. నిజానికి ఇందులో ఏమైనా నిజముందంటారా?

''అదేం లేదు. హీరోకి పవర్స్ ఏమీ ఉండవు. సూర్యుడి పాత్ర కీలకం. సూర్యుని చుట్టూనే కథ తిరుగుతుంది. వినయ్ గారు ఈ చిత్రాన్ని ఓ పెర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది. వినయ్ సినిమాల్లోకే కొత్త ఫైట్స్ ఇవి. కెమెరా పనితనం కొత్తగా ఉంటుంది'' అంటూ సెలవిచ్చాడు అఖిల్. ఆల్రెడీ తన సినిమా గురించి మీడియాతో డిస్కస్ చేయడం స్టార్ట్ చేసిన ఈ అక్కినేని యువకుడు.. ఇప్పుడు ఇలాంటి విషయాలు చాలానే చెబుతున్నాడు.

ఇకపోతే అక్టోబర్ 22న వస్తున్న ఆఖిల్ కోసం.. ఇప్పటికే తెగ ప్రేయర్లు చేస్తోందట హీరోయిన్ సయేషా సైగల్. ఈ సంవత్సరం వచ్చే దసరా పండుగ నా జీవితంలో అత్యంత కీలకమైనది అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది అమ్మడు. అది సంగతి.

,  ,  ,