Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 12:58:05
facebook Twitter Googleplus
Photo

హ్యాండ్ సమ్ అండ్ లవర్ బోయ్ గా కనిపించి ప్రేక్షకులను బాగానే మెప్పించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న కమర్షియల్ హిట్ సొంతమైనా ఆ క్రెడిట్ మొత్తం హీరోయిన్ సాయి పల్లవి - దర్శకుడు శేఖర్ కమ్ములకు వెళ్లిపోయింది. అయినా కూడా ఈ మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో వరుణ్ తేజ్ ప్రేమికుడిగా తన పాత్ర వరకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడనే చెప్పాలి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్. ప్రొడ్యూసర్. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో వరుణ్ తేజ్ ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా కండలు పెంచే పనిలో పడ్డాడు. జిమ్ లో ఎక్సర్ సైజులు అవీ గట్టిగానే చేస్తున్నాడు. తాజాగా తను వర్కవుట్స్ చేస్తున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా అభిమానులందరికీ షేర్ చేశాడు. లక్ష్యం చేరడం కోసం కసరత్తు చేస్తున్నానని.. ఇప్పటికి సగం చేరుకున్నానంటూ కామెంట్ కూడా పెట్టాడు.

టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోలందరిలో వరుణ్ స్పెషాలిటీ అతడి హైట్. ‘అయ్ బాబోయ్ ఎంత పొడవో’ అంటూ అమ్మాయిలు అబ్బురపడిపోయేంత హైటుంటాడు. ఇంత హైట్ కు తగ్గ బాడీ ఉంటే యాక్షన్ చిత్రాలకు బాగా సూటవుతాడు. వరుణ్ తేజ్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టున్నాడు. అందుకే బాడీబిల్డింగ్ పనిలో పడ్డాడు. పూర్తిగా తను కోరుకున్న లుక్ రావడడానికి ఇంకా ప్రయత్నించాలని వరుణ్ స్వయంగా పెట్టాడు.

,  ,  ,  ,