Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 08:45:57
facebook Twitter Googleplus
Photo

'నాకో మేనేజర్ ఉన్నాడు. ఒక పి.ఆర్. టీమ్ ఉంది. ఏం సందేహం వచ్చినా కూడా వారిని అడగండి'' అంటూ ఈ మధ్య కాలంలో పదే పదే ట్వీట్లు చేశాడు యంగ్ హీరో అఖిల్. ఇప్పుడు సందేహం ఏంటంటే.. అసలు అఖిల్ మేనేజర్ ఎవరు? కుర్రాడి పి.ఆర్. టీమ్ ఎవరు? ఇది తెలుసుకోవడానికే అందరూ ప్రయత్నిస్తున్నారు.

ఒకవేళ నిజంగానే పి.ఆర్. టీమ్ ఉన్నట్లయితే.. అఖిల్ డైరెక్టుగా ట్విట్టర్ లో స్టేట్ మెంట్లు ఇవ్వకూడదు. ఒక స్టార్ గా బ్రాండ్ చేసుకుంటున్న తరుణంలో.. ఏదో ఒక వెబ్ సైట్ లో తన సినిమా గురించి ఒక రూమర్ వస్తే.. దానికి తన పి.ఆర్. టీమ్ తో ఒక ప్రెస్ నోట్ విడుదల చేయించాలి. లేదంటే ఆయన మేనేజర్ మీడియా వారికి మెసేజ్ పెట్టాలి. షారూఖ్ ఖాన్ నుండి రామ్ చరణ్ వరకు ఇదే పద్దతిని ఫాలో అవుతుంటారు. కాని అఖిల్ మాత్రం సొంతంగా ట్వీట్లు వేసేసి.. నా టీమ్ కు ఫోన్ చేయొచ్చుగా అంటున్నాడు. అంత ఇన్ యాక్టివ్ గా ఉన్న ఆ పి.ఆర్ టీమ్ ఎవరో మరి.

ఇకపోతే మరో రెండు వారాల్లో కింగ్ నాగార్జున తన హాథీరామ్ బాబా సినిమా షూటింగ్ కు తిరుపతి వెళ్తున్నారని న్యూస్ వస్తోంది. అయినాసరే అఖిల్ రెండో సినిమాపై ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. మొన్న అఖిల్ కూడా.. సబ్జెక్ట్ ఇంకా కుదరలేదు అనే చెప్పాడు. ఎన్నాళ్ళీ వెయిటింగ్?

,  ,  ,  ,