Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2017 12:06:51
facebook Twitter Googleplus
Photo

హలో ఆడియో ఫంక్షన్ లో హీరో అఖిల్ కొత్తగా కనిపించాడు. గతంతో పోల్చితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగాయి. తప్పొప్పులను వేదికపైనే మాట్లాడేసేందుకు కూడా వెరవలేదు. రెండు నిమిషాలే మాట్లాడినా.. అనేక టాపిక్స్ కవర్ చేసేస్తూ మెచ్యూరిటీ చూపించాడు అఖిల్.

అందరికీ నమస్కారం.. ప్రియదర్శన్ గారూ.. అంతటి ప్రతిభావంతురాలైన కూతురిని మా సినిమాలో హీరోయిన్ గా ఇచ్చినందుకు థ్యాంక్యూ. గత ఏడాది అంతా నాకు ఎమోషనల్ జర్నీ. ఇవాళ ఇంత కాన్ఫిడెంట్ గా మీ ముందు నుంచున్నానంటే అందుకు అమ్మా నాన్నలే కారణం. మీరు ఇచ్చిన సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. నా ఆటిట్యూడ్ చెప్పేందుకు హలో నిదర్శనం. విక్రమ్ కి నేను పరిచయం అయినపుడు నటుడిగా నేను చాలా లో లెవెల్స్ లో ఉన్నాను.. కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా తక్కువే ఉన్నాయి. ఎనర్జీ లెవెల్స్ కూడా తక్కువే. నా గురించి నాకు తెలిసేలా చేసిన సినిమా హలో. ఇప్పుడు నేను థ్యాంక్యూ మాత్రమే చెప్పగలను. నాకు నువ్వు సోదరుడి లాంటి వాడివి. మొత్తం అక్కినేని ఫ్యాన్స్ తరఫున నీకు కృతజ్ఞతలు అన్నాడు అఖిల్.

ఇక అభిమాన దేవుళ్లు అందరికీ.. రెండేళ్లు రిలీజ్ లేకపోయినా నన్ను సపోర్ట్ చేశారు. నేను యాడ్స్ లో నటించినా మద్దతు పలికారు. మీకు ఇవ్వడానికి ప్రస్తుతం నా దగ్గర థ్యాంక్స్ తప్ప మరేం లేదు. ఒకటే చెబుతాను.. నేను హిట్టు కొట్టడానికి రెడీ.. మీరు రెడీయా

,  ,  ,  ,  ,  ,