Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 10:37:06
facebook Twitter Googleplus
Photo

ఏ సెలబ్రిటీ ఎంతమాత్రం ఇష్టపడని రీతిలో మీడియాలో బాగా నానిన అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్.. తాజాగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేశారు. తన గర్ల్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగి.. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. అనూహ్యంగా పెళ్లి క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ తర్వాత పెద్దగా కనిపించని అఖిల్.. తాజాగా ఒక ట్వీట్ చేశారు.

ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో తన తండ్రి నాగార్జున నిర్మిస్తున్న చిత్రంలో తన తల్లితో కలిసి భోజనం చేసిన ఆనందకరమైన విషయాన్ని ట్వీట్ ద్వారా అందరితో పంచుకున్నారు. బ్యూటీఫుల్ లేడీతో లంచ్ చేశా.. ఆమె నవ్వు అంటే చాలా ఇష్టం.. థాంక్యూ మై డియర్ అమ్మా అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అమ్మ అమలతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

చాలా కాలంగా ఖాళీగా ఉన్న అఖిల్.. ఈ మధ్యనే మనం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల మూడు నుంచి రెగ్యులర్ షూటింగ్లోకి దిగిన ఈ సినిమాకు మనం సాంకేతిక బృందం పని చేస్తుండటం గమనార్హం. ఈ చిత్రం మరో ట్రెండ్ ను సెట్ చేస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.


ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో తన తండ్రి నాగార్జున నిర్మిస్తున్న చిత్రంలో తన తల్లితో కలిసి భోజనం చేసిన ఆనందకరమైన విషయాన్ని ట్వీట్ ద్వారా అందరితో పంచుకున్నారు. బ్యూటీఫుల్ లేడీతో లంచ్ చేశా.. ఆమె నవ్వు అంటే చాలా ఇష్టం.. థాంక్యూ మై డియర్ అమ్మా అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అమ్మ అమలతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

చాలా కాలంగా ఖాళీగా ఉన్న అఖిల్.. ఈ మధ్యనే మనం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల మూడు నుంచి రెగ్యులర్ షూటింగ్లోకి దిగిన ఈ సినిమాకు మనం సాంకేతిక బృందం పని చేస్తుండటం గమనార్హం.

,  ,  ,  ,  ,