Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2017 11:56:12
facebook Twitter Googleplus
Photo

అఖిల్ హీరోగా రీ లాంఛ్ అయ్యేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నాడా అవుననే అంటున్నారు చిత్రపురి వర్గాలు. ఇప్పటికే హలో అంటూ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తన ద్వితియ చిత్రాన్ని కమిటైన అఖిల్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దాంతో పాటే తన మూడో సినిమాని కూడా ఈ యంగ్ హీరో లైన్ లో పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన హే జవానీ హే దివాని మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు అఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ స్టోరీని తన రెండో సినిమాగా తెరకెక్కించాలనుకున్న అఖిల్ మళ్లి చివరి నిమషంలో ఆ ప్రయత్నం మానుకొని విక్రమ్ కుమార్ తో ట్రావెల్ అవ్వడం మొదలుపెట్టాడు.

కానీ హే జవానీ హె దివాని స్టోరిని తెలుగు తగ్గట్లుగా మార్చాల్సిందిగా కొందరు రైటర్స్ కు చెప్పిన అఖిల్ ఇప్పుడు ఆ కథను తన మూడో సినిమాగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తేలింది. పి.వి.పి ప్రొడక్షన్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కబోతుందని సనీజనాలు అంటున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ నుంచి అఖిల్ మూడో సినిమా సెట్స్ పైకి వస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి

,  ,  ,  ,  ,