Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Dec-2015 17:50:57
facebook Twitter Googleplus
Photo

సక్సెస్ అనేది డెస్టినీ కాదు. సక్సెస్ అనేది ఓ పయనం. సక్సెస్ వస్తూ ఉంటే అది ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. సక్సెస్తోనే జీవనం సాగిస్తావ్.. అంటూ చాలా ఫిలాసఫికల్గా చెప్పింది ప్రియాంక చోప్రా. ఈ బాలీవుడ్ స్టార్ పేరు ప్రస్తుతం ఇంటా బైటా మార్మోగిపోతోంది. క్వాంటికో టీవీ సిరీస్ తో అటు హాలీవుడ్ లోనూ వీరాభిమానుల్ని సంపాదించుకుంది. ఈ సందర్భంలో జీవితంలో కాంప్లికేషన్ గురించి చెప్పుకుంటూ ఇలా వాపోయింది.

నేను ఎంత పెద్ద స్టార్ నయితేనేం. జీవించడానికి క్షణం సమయమే చిక్కడం లేదు. కావాల్సినంత డబ్బు ఉంది. గుర్తింపు ఉంది. అవార్డులున్నాయ్. కానీ ఏం లాభం.. టైమ్ కి నిదురపోను. టైమ్ కి తినే పరిస్థితి లేదు. రోజూ 16 గంటలు ఆన్ సెట్స్ కష్టపడుతున్నా. .. అని చెప్పుకొచ్చింది. అంతేనా అమెరికాలో క్వాంటికో షోతో వచ్చిన గుర్తింపు హాలీవుడ్ అవకాశాల్ని ఇస్తే నటిస్తానని చెప్పింది. అంతేనా అసలు అక్కడ అవకాశాలు ఎలా వస్తాయి? అన్న ప్రశ్నకు ఐదేళ్ల నుంచి అక్కడ నాకు ఓ పర్సనల్ పీఆర్ వో ఉన్నారు. ఆయనే ఈ అవకాశాల్ని వెతికి పెడుతున్నారు... అని అసలు సీక్రెట్ చెప్పింది. క్వాంటికో ఛాన్స్ అలా వచ్చింది. అయితే హాలీవుడ్ లో ఛాన్సులొచ్చినా నేను బాలీవుడ్ స్టార్ ని కాబట్టి అటు పూర్తిగా వెళ్లిపోయే ప్రసక్తే లేదని చెప్పింది.

ఈ జర్నీలో స్నేహం గురించి ముచ్చటిస్తూ నాకు దీపికకు కొందరు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. కలిసి నటిస్తున్నాం. కలిసే డిన్నర్ లకు వెళుతుంటాం... అని చెప్పింది. ప్రియాంక - దీపిక - రణవీర్ సింగ్ నటించిన భాజీరావ్ మస్తానీ ఈనెల 18న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

,  ,  ,