Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 14:24:30
facebook Twitter Googleplus
Photo

2.0 వాయిదా అంటూ పది రోజుల కిందట ఒక బాంబు పేలింది. ఐతే నిజంగా ఆ సినిమా వాయిదా పడనుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఒకసారి వాయిదా అని.. ఇంకోసారి అలాంటిదేమీ లేదని పీఆర్వోలు.. మీడియా వాళ్లు వార్తలు ఇచ్చారు కానీ.. 2.0 మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. వాళ్లు సైలెంటుగా వినోదం చూస్తున్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తే.

ఐతే 2.0 టీం సభ్యులకే రిలీజ్ డేట్ విషయంలో ఏ స్పష్టతా లేనట్లుగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ సైతం 2.0 రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పడం విశేషం. 2.0 రిలీజ్ వాయిదా అన్న వార్త బయటికి రాగానే అక్షయ్ కుమార్ తాను కథానాయకుడిగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ప్యాడ్ మ్యాన్ ను జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేశాడు.

కానీ 2.0 రిలీజ్ వాయిదా అన్నది కన్ఫమ్ కాకపోవడంతో అతను కొంచెం వెనక్కి తగ్గాడు. ఇంతకీ 2.0.. ప్యాడ్ మ్యాన్ ల్లో ఏది గణతంత్ర దినోత్సవం కానుకగా వస్తుంది అని అతణ్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. దీనిపై నాకు కూడా క్లారిటీ లేదు. 2.0 జనవరి 25న విడుదలైతే నా సినిమాను ఆపుతాను. ఆ సినిమా వాయిదా పడితే ప్యాడ్ మ్యాన్ 26న విడుదలవుతుంది. ఈ విషయంలో స్పష్టత కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా అని చెప్పాడు

,  ,  ,  ,  ,  ,