Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2016 15:20:05
facebook Twitter Googleplus
Photo

ఊరికే మాటలు చెప్పడం కాదు.. చేతల్లోనూ తమ పనితనం చూపిస్తున్నారు తమిళ యువ కథానాయకులు విశాల్.. కార్తి. శరత్ కుమార్ నేతృత్వంలోని నడిగర్ సంఘం పెద్దలందరినీ ఎదిరించి.. గత ఏడాది ఎన్నికల బరిలో నిలవడమే కాదు.. అద్భుత విజయం సాధించిన విశాల్ వర్గం.. ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటనీ నెరవేరుస్తుండటంతో తమిళ ఇండస్ట్రీ జనాలే కాదు.. సామాన్య జనాలు కూడా వారిని అభినందిస్తున్నారు. ఆల్రెడీ నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం మొదలుపెట్టేసిన విశాల్ అండ్ కో.. దీని కోసం తెచ్చిన రూ.2 కోట్ల బ్యాంకు లోన్ తీర్చడం కోసం క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం.. ఆ మ్యాచ్ ద్వారా అంచనాల్ని మించి రూ.9 కోట్ల ఆదాయం సమకూరడం తెలిసిన సంగతే.

మరోవైపు పేద కళాకారులకు సంఘం తరఫున పెన్షన్లు అందించే పని కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఐతే అంతటితో ఆగకుండా చెన్నై శివార్లలో నడిగర్ సంఘం కోసం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆడిటోరియం నిర్మించాలని.. మొత్తం 110 ఎకరాల్లో కల్చరల్ బిల్డింగ్స్ కట్టాలని కూడా నాజర్ నేతృత్వంలోని సంఘం నిర్ణయించింది. ఇందుకోసం ఇంకా రూ.26 కోట్ల దాకా నిధులు సమీకరించాల్సి ఉంది. ఇందుకోసం విశాల్-కార్తి కలిసి ఉచితంగా ఓ సినిమా చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఊరికే నోటి మాటతో వదిలేయకుండా త్వరలోనే ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు విశాల్-కార్తి. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల వాళ్లూ ఈ సినిమా కోసం ఉచితంగా పని చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా బాగా ఆడితే.. పాతిక కోట్ల ఆదాయం రావడం పెద్ద విషయం కాదు. ప్రస్తుతం కొందరు దర్శకులతో విశాల్-కార్తి చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాదే ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,