Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2016 10:28:55
facebook Twitter Googleplus
Photo

మనమంతా.. జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు మోహన్ లాల్. దీంతో మలయాళంలో ఆయన నటించే సినిమాల మీద మన ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. గత నెలలోనే ?ఒప్పం? సినిమాతో మలయాళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు లాల్. ఐతే అది ఎంతైనా ప్రయోగాత్మక చిత్రం. అందులో లాల్ అంధుడి పాత్ర చేశాడు. ఐతే ఇప్పుడు మోహన్ లాల్ లోని మాస్ హీరోను సరిగ్గా వాడుకుంటూ వైశాఖ్ అనే దర్శకుడు రూపొందించిన ?పులి మురుగన్? సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ (రూ.25 కోట్లు)తో ఈ సినిమాను తెరకెక్కించడమే కాదు.. అత్యంత భారీగానూ ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేశారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. అంచనాలకు తగ్గట్లే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మలయాళ సినిమాల కలెక్షన్ల రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. తొలి రోజే రూ.5 కోట్ల వసూళ్లతో ఔరా అనిపించిన ఈ సినిమా.. అత్యంత వేగంగా.. ఐదు రోజుల్లోనే రూ.20 కోట్ల మార్కును అందుకున్న సినిమాగానూ రికార్డు సృష్టించింది. ఫుల్ రన్లో మలయాళ సినిమా రికార్డులన్నీ బద్దలవుతాయని భావిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో మన జగపతిబాబు విలన్ పాత్ర పోషించాడు. ఆయన నటనకు కూడా అక్కడ ప్రశంసలు దక్కుతున్నాయి. ?పులి మురుగన్? సినిమాను ఇంగ్లిష్.. హిందీ భాషలతో పాటు చైనా వియత్నాం అధికారిక భాషల్లోనూ అనువాదం చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మోహన్ లాల్ వెల్లడించాడు. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమయ్యే అవకాశాలున్నాయి.

,  ,  ,  ,  ,  ,