Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2016 11:33:15
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీల్లో రిలీజ్ ప్లానింగ్ విషయంలో కూడా చాలా రూల్స్ మారుతున్నాయ్. అవి ఎవ్వరూ పెట్టిన రూల్స్ కాదు. ఎవరికివారే పెట్టుకున్న రూల్స్. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డెఫిసిట్ నడుస్తున్న దృష్ట్యా .. సినిమాలను ఎంత భారీ రేంజులో రిలీజ్ చేసినా కూడా భారీ ఓపెనింగులు వచ్చే ఛాన్సే లేదు. అందుకే సినిమాల మధ్యన సరైన గ్యాప్ వగైరా పాటించాల్సిందే.

మ్యాటర్ ఏంటంటే.. డిసెంబర్ 2 కంటే కూడా డిసెంబర్ 9న ధృవ సినిమాను రిలీజ్ చేస్తే బెటరంటూ అల్లు అరవింద్ అనుకుంటున్నారు. 9న వస్తే హాలిడే ఎడ్వాంటేజ్ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే 9న ధృవ వస్తే.. మరి వెంటనే వెనుకనే 16న సూర్య వస్తున్నాడు. తన సింగం 3 సినిమాను 16న ప్రపంచవ్యాప్తంగా తెలుగు అండ్ తమిళంలో రిలీజ్ చేయాలని సూర్య ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు అరవింద్ సూర్యతో మంతనాలు జరిపి ఎలాగైనా సింగం 3 సినిమాను వేరే డేట్లో దించాలని చూస్తున్నారట.

స్టార్ హీరో సూర్యకు అల్లు అరవింద్ అన్నా.. మెగా ఫ్యామిలీ అన్నా ఎనలేని రెస్పెక్ట్. ఎందుకంటే అసలు గజని సినిమాను ఆ రేంజులో ప్రమోట్ చేసి సూర్యకు తెలుగు మార్కెట్ క్రియేట్ చేసిందే మనోడు. ఆ అభిమానం దృష్ట్యా ఇప్పుడు సూర్య కొత్త డేట్లో వచ్చినా రావొచ్చు.

,  ,  ,  ,  ,  ,  ,