Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Dec-2017 10:24:13
facebook Twitter Googleplus
Photo

సుకుమార్ తో హీరో రామ్ చరణ్ తేజ్ చేస్తున్న పీరియాడికల్ మూవీ రంగస్థలం-1985 సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. తెలుగులో పీరియాడికల్ మూవీలు వచ్చేదే తక్కువ. అందులోనూ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది. రంగస్థలం తరవాత పూర్తి మాస్ ఎంటర్ టెయినర్ చేయాలని హీరో రామ్ చరణ్ డిసైడయ్యాడు. అందుకే మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.

రామ్ చరణ్ తో చేయబోయే మూవీకి సంబంధించి సబ్జెక్టు ఫైనల్ అవడంతో డైరెక్టర్ బోయపాటి శ్రీను షూటింగ్ కు సంబంధించిన పనుల్లో పడ్డాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ లేదా రాశీఖన్నాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో మళయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నాపేరు సూర్య సినిమాల్లో ఇప్పటికే హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో మెగా క్యాంప్ నుంచి ఆమెకు గట్టి సపోర్టే వస్తోంది. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాకు ఆమె పేరు ఫైనలైజ్ అయితే ఒకే టైంలో ముగ్గురు మెగా హీరోల పక్కన అవకాశం దక్కించుకున్న ఘనత ఆమెకు దక్కుతుంది. డి.వి.వి. దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం సినిమాకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. దీంతోపాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. భారీ బడ్జెట్ అండ్ క్యాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.

,  ,  ,  ,