Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 15:18:09
facebook Twitter Googleplus
Photo

పెద్ద స్టార్లందరూ ప్రెజంట్ వెకేషన్ లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సర్దార్ ఇచ్చిన పంచ్ తరువాత రిలాక్స్ అవుతున్నాడు. అల్లు అర్జున్ 60 కోట్ల సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మహేష్ బాబు కూడా బ్రహ్మోత్సవం రిలీజ్ ప్రెజర్ ను ముగించుకుని ఎబ్రాడ్ చెక్కేస్తున్నాడు. మొత్తానికి అందరూ అలా పరాయదేశాల్లోనే వెకేషన్ కు వెళుతున్నారనమాట.

ఇకపోతే ఆల్రెడీ పవన్ తన తదుపరి సినిమా ఏంటో చెప్పేశాడు. ఇక మహేష్ బాబు ఏమో మురుగుదాస్ సినిమా అన్నాడు.. అలాగే బన్నీ కూడా విక్రమ్.కె.కుమార్ సినిమా అన్నాడు. అయితే వీరిద్దరూ వెకేషన్ నుండి వచ్చిన తరువాత ఈ సినిమాలపై ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటారట. బన్నీ ఇప్పుడు సరైనోడుతో భారీ సక్సెస్ కొట్టాడు కాబట్టి.. వెంటనే మరోమాస్ సినిమా చేస్తే బెటరా లేకపోతే ఇంకోటేదైనా చేస్తే బెటరా అనేది చూస్తున్నాడట. ఇక మహేష్ కూడా బ్రహ్మోత్సవం ఫైనల్ రిజల్టును బట్టి తన తదుపరి ప్రాజెక్టు తాలూకు బడ్జెట్ లను డిసైడ్ చేస్తాడట. అంటే ఫారిన్ నుండి వచ్చాకనే మహేష్ అండ్ బన్నీ తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇస్తారనమాట.

,  ,  ,  ,  ,