Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2017 10:30:49
facebook Twitter Googleplus
Photo

వెండితెరపై సాధారణంగా ఏదన్నా ఒక బయోపిక్ చేస్తుంటే.. ఆ ఒరిజనల్ పర్సన్ తాలూకు ఆహార్యాలు రావడానికి వారి జీవన విధానాన్ని అనుసరిస్తారు నటులు. కాని స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం.. కమర్షియల్ సినిమా కోసం కూడా అదే రూటులో వెళుతున్నాడు. హరీశ్ శంకర్ డైరక్షన్లో వస్తున్న దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు మనోడు వెళ్తున్న రూటు సపరేటుగా ఉంది సుమీ.

ఏదో సరదాకి వెండితెరపై ఒక బ్రాహ్మణుడి గెటప్ వేయడం వేరు.. అదే నిజంగానే బ్రాహ్మిణ్ వే ఆఫ్ లైఫ్ లో ఉండటం వేరు. ముఖ్యంగా మాంసాహారలు తినకుండా.. మత్తుపానీయాలు పుచ్చుకోకుండా.. రోజూ మడితో జీవనవిధానం అవలంభించడం అంటే కాస్త కష్టమైన అంశమే. కాని అల్లు అర్జున్ మాత్రం.. ఒడుగు ఒక్కటే చేయించుకోలేదేమో కాని.. గత ఆర్నెల్లుగా మాంసం ముట్టట్లేదట. రోజూ ఉదయాన్నే పూజలు.. సాయంత్రం పూజలు.. మడి.. వగైరా వగైరా ఫాలో అవుతున్నాడట. వెండితెరపై తాను చేయాల్సిన శర్మ గారి అబ్బాయి క్యారెక్టర్లో ఇలా పూర్తి స్థాయిలో ఇమిడిపోయాడని తెలుస్తోంది. అహర్నిశలూ అచ్చమైన బ్రాహ్మణుడిలా జీవించినప్పుడే ఈ క్యారక్టర్ కు జీవం పోయడం సాధ్యపడుతుందని మనోడి అభిప్రాయం కాబోలు.

బాగానే ఉందయ్యా బన్నీ.. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాని ఇదే సినిమాలో మనోడు చివర్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని కూడా అంటున్నారు.

,  ,  ,  ,  ,  ,