Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 12:42:09
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ క్రేజ్ ని కౌంటింగ్ చేయడానికి మెషీన్స్ కి కూడా కష్టం అవుతుంది. ఒక్కో ఇండస్ట్రీ చొప్పున కవర్ చేసుకుంటూ.. తన ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు స్టైలిష్ స్టార్. ఇప్పుడు ట్విట్టర్ ఫాలోయింగ్ లో ఓ ల్యాండ్ మార్క్ ను అందుకున్నాడు బన్నీ.

టాలీవుడ్ తో పాటు మల్లూవుడ్ లోను.. కర్నాటకలోను విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో కూడా భాగం అవుతుంటాడు. మరీ ఎక్కువగా కాదు కానీ.. అడపా దడపా తన ఫీలింగ్స్ ను ట్వీట్ చేస్తూ.. అభిమానులతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు ట్విట్టర్ లో బన్నీ ఫాలోయర్ల సంఖ్య 10 లక్షల మార్క్ ను టచ్ చేసింది. దీంతో 'మీ ప్రేమతో ఒక మిలియన్ మార్క్ అందుకునేలా చేసినందుకు థాంక్యూ' అంటూ ట్వీట్ చేశాడు స్టైలిష్ స్టార్. ఈ మార్క్ ను అందుకున్న అతి కొద్ది మంది టాలీవడ్ స్టార్స్ జాబితాలో బన్నీ కూడా చేరాడు.

ఇక సినిమాల సంగతి చూస్తే ప్రస్తుతం డీజే-దువ్వాడ జగన్నాధంను రెడీ చేస్తున్నాడు బన్నీ. హీరో రెండు వేరియేషన్స్ ఉండే పాత్ర చేయడం.. ఈ మూవీకి హైలైట్ కానుందని తెలుస్తోంది. ముకుంద బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో మొదటిసారిగా మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్.

,  ,  ,  ,  ,