Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 11:24:50
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ తన కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా దువ్వాడ జగన్నాధం కోసం 24/7 పని చేస్తున్నాడు అల్లు అర్జున్. పతాక సన్నివేశాలు పూర్తి చేసి ఇప్పుడు ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ మరో వైపు పాటల చిత్రీకరణ కూడా ఒకేసారి చేస్తున్నాడు. పూజా హెగ్డేతో కలసి హైదరాబాదులో స్టెప్పులు వేస్తున్నాడంతే. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి సినిమా పై అంచనాలు ఇంతకు అంతై కొండంతై ఇప్పుడు పర్వతం అయ్యింది. జూన్ 23న రిలీజయ్యే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..

వచ్చే వారంలో ముందుగా మరో పాట విడుదల చేస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ జూన్ 12న హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ కార్యక్రమముకు సినిమా లో అల్లు అర్జున్ కి జతగా చేసిన పూజ హెగ్డే మ్యూజిక్ కొంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంకా ఫిల్మ్ యూనిట్ మొత్తం విచ్చేసి.. ప్రత్యేకంగా ఏదో చేయబోతున్నారట. ఈ మధ్యన ఇటువంటి ఈవెంట్లను స్టయిలిష్ గా చేస్తున్నారు కాబట్టి.. డిజె టీమ్ ఏం ప్లాన్ చేసిందో చూడాలి.

డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ ప్రేక్షకులును దృష్టిలో ఉంచుకొని తీసిన సినిమాగా డిజె గురించి చెప్పవచ్చు. అల్లు అర్జున్ డాన్స్ లు కామిడీ టైమింగ్ యాక్షన్ ఏది తక్కువ కాకుండా ఎవ్వరిని నిరాశపరచకుండా చాలా జాగ్రత పడ్డారట.

,  ,  ,  ,  ,  ,  ,