Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2017 12:59:12
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే- దువ్వాడ జగన్నాధం విడులయ్యేందుకు మరో మూడు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ శుక్రవారం నాడు థియేటర్లలోకి వచ్చేస్తోన్నాడు డీజే. అందుకే ప్రమోషన్స్ విషయంలో గేర్ మార్చేస్తున్నాడు దిల్ రాజు.

డీజే కోసం తెలుగు రాష్ట్రాలు మొత్తం చక్కర్లు కొట్టేయాలని ఫిక్స్ అయిపోయారు. అయితే.. ప్రమోషన్స్ కోసం ఇంకా చాలా తక్కువ సమయం ఉండడంతో.. హెలికాప్టర్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఇవాళ.. రేపు హైద్రాబాద్ లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్న బన్నీ అండ్ టీం.. 21వ తారీఖున ఏపీ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ఉదయాన్నే ఛాప్టర్ ఫ్లైట్ లో బయల్దేరి మొదట విజయవాడలో ల్యాండ్ అయి ఫ్యాన్స్ ను మీట్ కానున్న బన్నీ.. అక్కడి నుంచి వైజాగ్ వెళ్లి ప్రచారం చేయనున్నాడు. విశాఖ నుంచి బయల్దేరి తిరుపతి చేరుకోనున్న అల్లు అర్జున్ అక్కడ కూడా అభిమానులను కలవనున్నాడు.

గతంలో గబ్బర్ సింగ్ మూవీ కోసం కూడా హీరో పవన్ కళ్యాణ్.. దర్శకుడు హరీష్ శంకర్ ఇలాగే చాప్టర్ ఫ్లైట్ లో ప్రచారం చేశారు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలోనే రూపొందిన డీజే మూవీ కోసం సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతుండడం విశేషం.

,  ,  ,  ,  ,