Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 12:10:09
facebook Twitter Googleplus
Photo

స్టార్ రైటర్ గా గుర్తింపు పొందిన రచయిత కోన వెంకట్. ఈయన రాసిన స్టోరీలు కొన్నేళ్ల పాటు జనాలకు బాగానే నచ్చినా.. కొంత కాలం తర్వాత మూస ధోరణి అయిపోయాయి. దీంతో రైటింగ్ కంటే ప్రొడ్యూసర్ గా బిజీ అయిన కోన.. బాలీవుడ్ లో మాత్రం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

అక్కడ సీనియర్లతో మంచి ర్యాపో మెయింటెయిన్ చేయడం ఈయనకు బాగా కలిసొచ్చిన విషయం. ఇప్పడీ రైటర్ అందించిన కథతో ఓ సినిమా చేస్తున్నట్లు కన్ఫాం చేశాడు.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం టైగర్ జిందా హై రిజల్ట్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు సల్లూభాయ్. ఈ స్టార్ హీరో గత చిత్రం ట్యూబ్ లైట్.. బాక్సాఫీస్ దగ్గర భారీ ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో తన తర్వాతి మూవీ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్న సల్మాన్.. టీజర్.. ట్రైలర్ అన్నీ తన ఫ్యాన్స్ ను మెప్పించే విధంగానే సిద్ధం చేశాడు.

రేపు రిలీజ్ కానున్న టైగర్ జిందా హై మూవీపై అంచనాలు బాగానే ఉండగా.. 2019లో ప్రారంభమయ్యే తన తర్వాతి చిత్రాలను అనౌన్స్ చేశాడు సల్మాన్ ఖాన్. ఒకేసారి ఐదు చిత్రాలను ప్రకటించగా.. వాటిలో కోన రైటప్ లో తెరకెక్కే మూవీ కూడా ఒకటి. షేర్ ఖాన్ టైటిల్ పై తెరకెక్కే ఈ మూవీని సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించనున్నాడు.

,  ,  ,  ,