Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 18:24:31
facebook Twitter Googleplus
Photo

కథానాయికలందరికీ అభిమానులుంటారు. సమంతకి మాత్రం ఆత్మీయమైన అభిమానులున్నారు. వాళ్లంతా సమంత అంటే తమ సొంత మనిషిలాగే చూస్తుంటారు. తెలుగులోనే కాదు - తమిళంలోనూ అలాంటి అభిమానుల్నే సంపాదించుకొంది సమంత. అందుకే ఆమెకి సంబంధించి మంచి చెడు ఏదైనా వెంటనే స్పందిస్తుంటారు ఆ అభిమానులంతా.

మొన్నటిదాకా కేవలం అభిమానులు మాత్రమే ఆమెని ఇంతగా ప్రేమించేవారు. ఇప్పుడు తోటి నటీనటులు కూడా సమంతపై చెప్పలేనంత ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తున్నారు. వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ యాక్ట్రెస్ - వన్ ఆఫ్ ది నైసెస్ట్ పర్సన్ అంటూ సంబోధిస్తున్నారంటే ఆ నటీనటులందరికీ సమంత ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమె పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం టాలీవుడ్ పండగ చేసింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఎక్కడ చూసినా సమంత నామజపమే.

కథానాయికలు మొదలుకొని ప్రతి ఒక్కరూ ఆమెకి విషెస్ చెప్పారు. నితిన్ అయితే ఓ అడుగు ముందుకేసి సమంత పుట్టినరోజు కానుకగా అఆ సినిమాలోని స్టిల్ ని విడుదల చేశాడు. అలాగే బ్రహ్మోత్సవం టీమ్ కూడా సమంత - మహేష్ లతో కూడిన కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రెండు పో్స్టర్లలోనూ సమంత కనిపిస్తున్న విధానం అదుర్స్ అనిపించేలా వుంది. సమంత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని టాలీవుడ్ కూడా ఇలాంటి పండగలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం

,  ,  ,  ,  ,  ,  ,