Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2016 12:08:26
facebook Twitter Googleplus
Photo

కోట్లాదిమంది యూత్ కు ఐకాన్ గా నిలిచే హీరో అల్లుఅర్జున్. యూత్ హీరోల్లో అతగాడి స్టైల్ కాస్త భిన్నం. మిగిలిన హీరోలకు మించిన ఇమేజ్ అతగాడి సొంతం. గంగోత్రి సినిమా చూసినప్పుడు ఇతగాడు హీరోనా? అనుకున్నోళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడెంత క్రేజ్ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ సినిమా హీరో అవ్వాలని అనుకున్నాడా? అసలుసినిమాలు చేయాలనుకున్నాడా? అన్న ప్రశ్నలు వేస్తే.. ఆసక్తికర సమాధానం రావటమే కాదు.. కోట్లాది మంది మాదిరే సాదాసీదా ఉద్యోగిగా తన కెరీర్ స్టార్ట్ చేశారన్న నిజం ఒకటి బయటకు వచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తన కెరీర్ గురించి తాను వేసుకున్నప్లాన్స్ గురించి అల్లు అర్జున్ మాటల్లోనే చూస్తే.. ఏదో అవ్వబోయి మరేదో అయ్యాడే అనిపించక మానదు. అల్లు అర్జున్ ఇంటర్ పూర్తి చేసేసరికి ఐటీ బూమ్ స్టార్ట్ అయ్యింది. ఐటీ కాకుండా యానిమేషన్ కోర్సు చేయాలని బలంగా అనిపించింది. దాన్నే నా కెరీర్ గా అనుకున్నా. యానిమేషన్ లో ఉన్నత విద్య కోసం ఫారిన్ వెళ్లాలని అనుకున్నా. దాని కంటే ముందే.. ఈ రంగంలో ఉన్న అవకాశాల్ని చెక్ చేసుకోవాలని అనుకున్నా. అందుకోసం చాలానే ప్రయత్నాలు చేశా. చివరకు యానిమేషన్ రంగంలో సెటిల్ కావాలని డిసైడ్ అయ్యా.

ఫారిన్ కు వెళ్లటానికి ముందు యానిమేషన్ రంగంలో నేనెంతగా రాణిస్తానో చెక్ చేసుకోవటానికి సోమాజీగూడలోని శ్రీవెన్ మల్టీటెక్ అనే యానిమేషన్ కంపెనీలో ఆర్నెల్లు అప్రెంటీస్ గా ఉన్నా. అప్పట్లో నా జీతం రూ.3500. అదే నా తొలి జీతం. యానిమేటర్ ని కావాలనుకున్న నేను సినిమా హీరో కావటం అనుకోకుండా జరిగిందే.

,  ,  ,  ,  ,  ,  ,