Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2017 09:46:00
facebook Twitter Googleplus
Photo

ఒకేసారి ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యి టాలీవుడ్ లో కొంచెం సందడి చేసే ప్రయత్నం చేశాయి. కానీ అందులో సిద్దార్ట్ గృహం తప్పితే ఏ సినిమా ఆంతగా అంచనాలను అందుకోవడం లేదు. ఇక ఈ శుక్రవారం కూడా మరి కొన్ని సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో కొన్ని సినిమాలు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ థియేటర్స్ కొరత కొంచెం గట్టిగానే ఎఫెక్ట్ చూపించే సరికి వాయిదా వేస్తూ వచ్చాయి.

ఫైనల్ గా చిన్న సినిమాలు ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. నారా రోహిత్ - బాలకృష్ణుడు అలాగే శ్రీ విష్ణు యొక్క మెంటల్ మదిలో వంటి సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ - నెపోలియన్ - ఇప్పట్లో రాముడిల సీతాల ఎవరుంటారండి బాబు - జంధ్యాల రాశిన ప్రేమ కథ - అండ్ సాయి పల్లవి హే పిల్లగాఢ తో పాటు లక్ష్మి రాయ్ యొక్క జూలీ 2 సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాల ప్రొడ్యూసర్స్ ఎవరి స్థాయిలో వారు సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడి ఫ్యామిలీకి చెందిన నారా రోహిత్ సినిమా మాత్రం చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ కానుందట.

ప్రొడ్యూసర్ సురేష్ బాబు అండతో మెంటల్ మదిలో సినిమా ఎక్కువ డియేటర్స్ లో రిలీజ్ కానుందని టాక్ బాగా వినిపిస్తోంది. ఇక సాయి పల్లవి ఫిదా సినిమాతో హిట్టు కొట్టడంతో ఆమె మళయాళ రీమేక్ హే పిల్లగాఢ కూడా ఎక్కువ థియేటర్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. లక్ష్మీ రాయ్ - జూలి 2కి కూడా థియేటర్స్ బాగానే అందాయట. కానీ సీఎం తమ్ముడి కొడుక్కి ఈ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా కూడా తక్కువ థియేటర్స్ దొరకడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది.

,  ,  ,  ,  ,  ,