Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Aug-2017 11:08:26
facebook Twitter Googleplus
Photo

వక్కంతం వంశీ డైరక్షన్లో రూపొందుతున్న సినిమా నా పేరు సూర్య.. దీని క్యాప్షన్ నా ఇల్లు ఇండియా. ఈ సినిమా షూటింగ్ ఇవాళే (బుధవారం) మొదైలంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ను భలే సైలెంటుగా స్టార్ట్ చేసేసిన స్టయిలిష్ స్టార్.. ఇప్పుడు మరో విషయం చెబుతున్నాడు. అదేంటంటే.. మరో 13 రోజుల్లో ఒక గిఫ్ట్ ఇస్తున్నాడట.

అవును.. నా పేరు సూర్య సినిమాకు సంబంధించి ఒక గిఫ్ట్ ఏదో ఆగస్టు 15న వస్తోందట. విశాల్-శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక సైనికుడిగా నటిస్తున్నాడు. గతంలో ఏదో ఆర్మీ రిటర్న్ అంటూ ఒక క్యారక్టర్ చేశాడు కాని.. పూర్తి స్థాయిలో సైనికుడిగా మాత్రం కనిపించలేదు. ఇప్పుడు నా పేరు సూర్య సినిమాలో మాత్రం దేశభక్తికి సంబంధించిన కాన్సెప్టు ఉండటంతో.. అమెరికాకు చెందిన ఒక ట్రైనర్ ను పిలిపించుకుని ఒక ఫిట్ సైనికుడిలా ఆర్మీ జవాన్ లా మారిపోతున్నాడు. మరి ఇంతకీ ఆగస్టు 15న ఏ గిఫ్ట్ ఇస్తాడు? ఏదన్నా సాంగ్ రిలీజ్ చేస్తాడా? లేదంటే జవాన్ అవతార్ లో ఏదన్నా ఫోటో షూట్ చేసి తన దేశభక్తి చాటుకుంటాడా? లేదంటే ఆ రోజు ఇంకేమైనా చూపిస్తున్నాడా?

ఏదేమైనా కూడా ఒక సినిమాను షూటింగ్ మొదలుపెట్టిన రోజు నుండే ప్రమోట్ చేయాలని అల్లు అర్జున్ ఇప్పుడు షారూఖ్ ఖాన్ దగ్గర నేర్చుకున్నట్లున్నాడు. షారూఖ్ తరహాలో సినిమా షూటింగ్ మొదలైన రోజు నుండే ప్రమోషన్లు చేసేస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,