Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 15:55:29
facebook Twitter Googleplus
Photo

సమంత ఎన్టీఆర్ తో సమానట. అదే ఎందులో వయసులోనా.. ? డ్యాన్సుల్లోనా.. ?? నటనలోనా.. ??? రొమాన్స్ చేయడంలోనా? ???? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇవన్నింటీలో ఏవీకావట. సినిమాల సంఖ్యలో సమంత ఎన్టీఆర్ తో సమానట. అదెలాగంటే.. ఇటీవలే ఎన్టీఆర్ 25వ సినిమాగా వచ్చిన ?నాన్నకు ప్రేమతో? సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ ఊపులోనే తన 26వ చిత్రంగా ?జనతా గ్యారేజ్?ని మొదలెట్టాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెకుతోన్న ఈ చిత్రంలో తారక్ సరసన సమంత, నిత్యామీనన్ లు జతకట్టనున్నారు.

అయితే, గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో జతకడుతోన్న సమంతకి ఇది 26వ చిత్రం కావడం విశేషం. ఇటీవలే సమంత 25వ చిత్రంగా ?అ ఆ? రిలీజై సూపర్ హిట్ ని సొంతం చేసుకొంది. ఇప్పుడు గ్యారేజ్ సమంతకి 26వ చిత్రం. సో.. సినిమాల సంఖ్యలో సమంత ఎన్టీఆర్ తో సమానం అన్నమాట. గ్యారేజ్ కూడా హిట్ అయితే.. సమంత, ఎన్టీఆర్ ఖాతాలో 26వ చిత్రం హిట్ చిత్రంగా నిలిచిపోయే అవకాశాలున్నాయి.

ఇక, గ్యారేజ్ విషయానికొస్తే.. ఆగస్ట్ 12న ఈ మూవీ ఆడియో విడుదల కానుంది. సెప్టెంబర్ 2న గ్యారేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,