Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 15:26:39
facebook Twitter Googleplus
Photo

మన హీరోలు ఫారిన్ టూర్లు వెళుతున్నారంటే.. ఏ దేశం వెళుతున్నారంటూ జనరల్ గా ఒక ఎక్సయిట్మెంట్ ఉంటుంది. రామ్ చరణ్ తన హనీమూన్ కు స్పెయిన్ వెళ్ళినా.. మహేష్ బాబు ఆ మధ్యన ప్యారిస్ వెళ్లినా.. ఆ ఫోటోలను చూస్తేనే ఒక కిక్ వచ్చేస్తుంది. అలాగే బన్నీ కూడా ఎప్పుడూ దుబాయ్ లో రచ్చ చేస్తుంటాడు.

సర్లేండి.. ఇప్పుడు తమ సినిమాలు రిలీజయ్యాక.. మహేష్ బాబు ఈసారి బ్రిటన్.. బన్నీ బాబు కూడా ఏదో ఫారిన్ వెకేషన్ కు చెక్కేస్తున్నారని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే బన్నీ మాత్రం ఫారిన్ వెళ్ళలేదట. మనోడు 10 నుండి 15 రోజుల వరకు కాశ్మీర్ లో ఉంటాడట. అక్కడ జమ్మూలోని వివిధ ఎక్సోటిక్ లొకేషన్లను చూసి.. తన కొడుకు అయాన్.. భార్య స్నేహ తో కలసి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగొస్తాడట. నిజానికి కాశ్మీర్ ను చూస్తే స్విట్జర్లాండ్ ఎందుకు సరిపోదు అంటూ చాలామంది హీరోలు కామెంట్లు చేస్తుంటారు. మొన్ననే తని ఒరువన్ సినిమా కోసం చరణ్ కూడా కాశ్మీర్ లో షూటింగ్ చేసొచ్చాడు. మరి బావ బన్నీకి అక్కడకు వెళ్ళమని తనే సలహా ఇచ్చాడా?

ఇక బన్నీ కాశ్మీర్ వెళ్ళాడు అనగానే.. ఆల్రెడీ అక్కడకు హాలీడేస్ కు వెళ్ళిన మన తెలుగోళ్లు.. బన్నీతో ఒక్క స్నాప్ అయినా దొరుకుతుందేమో అని ఆ ప్రదేశాలన్నీ వెతికేస్తున్నారట. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,