Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:48:16
facebook Twitter Googleplus
Photo

మూస సినిమాల ఒరవడిలో కొట్టుకుపోతున్న ప్రజలకి రెండు దశాబ్దాల క్రిందటే తమ టాలెంట్ ఏంటో భారతీయుడు సినిమా ద్వారా చూపించిన ఘనత శంకర్ మరియు కమల్ హాసన్ ది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. కమల్ మ్యేక్ అప్ - మర్మకళ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి.

అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఏ.ఎం రత్నం ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ని నిర్మించాలన్న యోచనలో వున్నాడు. దీని గురించి ఇప్పటికే కమల్ ని సంప్రదించినట్టు సమాచారం. శంకర్ కూడా సుముఖత తెలుపుతున్నట్టు తెలుస్తుంది. భారతీయుడు క్లైమాక్స్ లో ముసలి కమల్ హాసన్ నా దేశానికి ఎప్పుడు అవసరమైనా నేను వస్తా అనే డైలాగ్ ఈ సీక్వెల్ కి పునాదిగా నిలుస్తుంది. చూద్దాం మరి ఈ ప్రాజెక్ట్ ఎంత మేరకు కార్యరూపం దాల్చనుందో..

,  ,  ,  ,  ,  ,