Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 10:50:49
facebook Twitter Googleplus
Photo

సరైనోడు లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ తారాస్థాయికి చేరిపోయింది. ఇక ఈ స్టేటస్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఆయన తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్‌తో అల్లు అర్జున్ తన కొత్త సినిమా చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాం. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం ప్ర్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
?మిరపకాయ్?, ?గబ్బర్ సింగ్?, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి తన గత చిత్రాల తరహాలోనే హరీష్ శంకర్ ఈ సినిమాను ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారట. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ పరంగా ఎప్పుడూ కొత్తదనం చూపించే హరీష్, బన్నీ కోసం డిజైన్ చేసిన పాత్ర కూడా అదిరిపోయేలా ఉందని టీమ్ వర్గాల నుంచి సమాచారం. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

,  ,  ,  ,  ,  ,