Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 16:20:22
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుత ఆధునిక జీవితంలో చిన్న కుటుంబాలు ఎక్కువైపోయాయి. అందరూ ఒక్కచోట కలుసుకోవడానికి సమయం చిక్కడం లేదు. ఇలా అందరూ కలుసుకుంటే ఓ ఉత్సవంలా ఉంటుంది అన్న కథాంశంతో ?బ్రహ్మోత్సవం? మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ?బ్రహ్మోత్సవం? సినిమాలో ఓ సన్నివేశం చేసేటప్పుడు తనకి చిన్నపాటి రోజులు గుర్తుకు వచ్చాయని చెప్పాడు. అంతేకాకుండా ఆ సన్నివేశం గురించి చెపుతూ?? ఈ సినిమా చేసేటప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొస్తుంటుంది. కానీ ఇందులో ఓ సన్నివేశంలో కుటుంబమంతా కలిసి విహారం కోసం ఊటీకి వెళ్లే ఓ సందర్భం ఉంటుంది. ఆ సన్నివేశంలో అందరూ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తూంటారు. ఆ సన్నివేశం లో అంతమంది నటులతో కలిసి చేసేటప్పుడు మాత్రం నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి? అని అన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటించారు.

,  ,  ,  ,  ,  ,